ఫిబ్రవరిలో సినిమాలే సినిమాలు!

ఒకప్పుడు టాలీవుడ్ లో ఫిబ్రవరి నెలలో సినిమాలు రిలీజ్ అయ్యేవి కాదు.. మేకర్స్ ఫిబ్రవరి నెలను సినిమాలు రిలీజ్ చేయడానికి అనువుగా భావించేవారు కాదు. కానీ గతేడాది ఫిబ్రవరిలో ఎన్టీఆర్ తన ‘టెంపర్’ సినిమాను రిలీజ్ చేసి హిట్ కొట్టాడు. దీంతో ఈ ఏడాది కూడా తమ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు.

ఈ క్రమంలో ముందుగా నాని ‘నేను లోకల్’ సినిమా ఫిబ్రవరి 3న విడుదల కాబోతుంది. త్రినాధారావు నక్కిన డైరెక్ట్ చేసిన ఈ సినిమా దిల్ రాజు బ్యానర్ లో రూపొందింది. ఈ సినిమాపై మొదటి నుండి మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాతో పాటు మోహన్ లాల్ ‘కనుపాప’ సినిమా కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమాల తరువాత సూర్య క్రేజీ ప్రాజెక్ట్ ‘సింగం 3’ ఫిబ్రవరి 9న సందడి చేయబోతోంది. ఆ మరుసటి రోజే నాగార్జున నటించిన భక్తి చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’ థియేటర్స్ లో హడావిడి చేయనుంది.

ఆ తరువాత వచ్చే శుక్రవారం ఫిబ్రవరి 17న ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ముందుగా రానా ‘ఘాజీ’, దాంతో పాటు మంచు మనోజ్ ‘గుంటురోడు’, రాజ్ తరుణ్ ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ రిలీజ్ కాబోతున్నాయి. చివరగా సాయి ధరం తేజ్, గోపిచంద్ మలినేని
కాంబినేషన్ లో రూపొందిన ‘విన్నర్’ సినిమా ఫిబ్రవరి 24న రాబోతుంది. మొత్తానికి ఇలా వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవబోతోంది!

CLICK HERE!! For the aha Latest Updates