ఆస్కార్ అవార్డ్ ను కాదనుకున్నాడు!

ఆస్కార్ అవార్డును దక్కించుకోవడానికి సినీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై కోపంతో అటువంటి బహుమతి వచ్చినా.. తనకు అక్కర్లేదంటూ అవార్డ్ ఫంక్షన్ ను బహిష్కరించారు. ‘ది సేల్స్ మెన్’ సినిమాకు గాను ఉత్తమ ఫారెన్ చిత్రంగా ఆస్కార్ అవార్డ్ పొందిన ఇరానీ దర్శకుడు అస్ఘర్ ఫర్హాదీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.
ముస్లిం దేశాలపై ట్రంప్ విధించిన బ్యాన్ పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఆయన ఈ కార్యక్రమానికి వెళ్లలేదు. ‘ప్రపంచాన్ని అమెరికా దాని శత్రువులుగా విభజించడం ద్వారా మిగిలిన దేశాలకు ఒక రకమైన భయం కలిగించారని ఇది యూద కాంక్షతో కూడిన దాడి లాంటిదని.. ఈ యుద్ధాలు ప్రజాస్వామ్యాన్ని మానవ హక్కులను హరిస్తాయని” ఆయన ఓ సందేశం పంపారు. ఈ సందేశాన్ని అనౌషే అన్సారీ ఆస్కార్ వేదికపై చదివి వినిపించారు. 2011లో కూడా అస్ఘర్ ఫర్హాదీకి విదేశీ చిత్రాల భాగంలో ఆస్కార్ అవార్డ్ వచ్చింది.