HomeTelugu Trendingశశివదనే: హీరో ఫస్ట్‌లుక్‌

శశివదనే: హీరో ఫస్ట్‌లుక్‌

First look from Sasivadane
యంగ్‌ హీరో రక్షిత్‌ అట్లూరి నటిస్తున్న తాజా చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. సాయి మోహన్ ఉబ్బన డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా నుండి హీరో రక్షిత్ అట్లూరి బర్త్ డే ను పురస్కరించుకొని హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ.. గోదావరి నేపథ్యంలో తీస్తున్న లవ్ అండ్ యాక్షన్ డ్రామా ఈ ‘శశివదనే’ చిత్రంలో లవ్ సీన్స్ చాలా కొత్తగా ఉంటాయి. డైరెక్టర్‌ సాయి మోహన్ ఉబ్బన ఈ సినిమాను చాలా గ్రాండియ‌ర్‌గా, హై స్టాండ‌ర్డ్స్‌లో తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి మ్యూజిక్, విజువల్స్ హైలైట్ గా నిలుస్తాయి. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం’ అన్నారు రఘు కుంచె, వ్రీమాన్‌, కోమలి ప్రసాద్‌, రంగస్థలం మహేశ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి శరవణ వాసుదేవన్ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu