HomeTelugu Trendingఅబ్దుల్‌ కలాంగా అలీ.. పోస్టర్ విడుదల

అబ్దుల్‌ కలాంగా అలీ.. పోస్టర్ విడుదల

6a 2

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ జీవిత కథతో ఒక సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో ప్రముఖ హాస్యనటుడు అలీ ‘అబ్దుల్ కలామ్’ గా నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ మూవీ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ కార్త్యక్రమంలో కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవదేకర్ మాట్లాడుతూ.. ఎందరివో బయోపిక్ లు వచ్చాయి. ఇప్పుడు అబ్దుల్ కలాం పై సినిమా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజల మనసు గెలుచుకున్న గొప్ప వ్యక్తి, చివరి వరకు అబ్దల్ కలాం సామాన్యుడిలా జీవించారని కొనియాడారు. భారతదేశానికి శాటిలైట్ సేవలు అందించిన ఘనత కలాందేనన్నారు.

అలీ మాట్లాడుతూ… గత 40 ఏళ్లుగా తాను కలామ్‌ అభిమానినని అన్నారు. ఆయన సినిమాలో నటించడం అదృష్టంగా బావిస్తున్నాను అని అన్నారు. కాగా దర్శకుడు జగదీష్ దానేటి, నిర్మాత జాన్ మార్టిన్ నేతృత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. టాలీవుడ్, హాలీవుడ్ కలయికతో సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

6 8

Recent Articles English

Gallery

Recent Articles Telugu