HomeTelugu Trendingహాయ్‌ నాన్న: గాజుబొమ్మ సాంగ్‌ ప్రొమో

హాయ్‌ నాన్న: గాజుబొమ్మ సాంగ్‌ ప్రొమో

hi nanna movie update
టాలీవుడ్ స్టార్ హీరో నాని నటిస్తున్న తాజా చిత్రం హాయ్‌ నాన్న. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో నాని 30 గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి శౌర్యువ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ భామ మృణాళ్‌ ఠాకూర్ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ మూవీ నుంచి రెండో సాంగ్ గాజుబొమ్మ అప్‌డేట్ అందించారని తెలిసిందే. మేకర్స్‌ సోల్‌ ఆఫ్ హాయ్‌ నాన్న పాట ప్రోమోను లాంఛ్ చేశారు. గాజు బొమ్మ సాంగ్‌ తండ్రీ కూతుళ్ల క్యూట్ జర్నీ నేపథ్యంలో సాగుతూ మ్యూజిక్‌ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది.

ఫుల్ సాంగ్‌ను అక్టోబర్‌ 6న లాంఛ్ చేయనున్నారు. మేకర్స్‌ ఇప్పటికే లాంఛ్‌ చేసిన హాయ్‌ నాన్న టైటిల్ గ్లింప్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకి హేశమ్‌ అబ్దుల్‌ వహబ్‌ సంగీతం అందిస్తున్నాడు. హాయ్ నాన్నలో మృణాళ్‌ ఠాకూర్ యశ్న పాత్రలో కనిపించనుండగా.. బేబి కైరా ఖన్నా నాని కూతురుగా నటిస్తోంది.

నాని టీం ఇటీవలే తమిళనాడులోని కూనూర్, ఊటీలో హాయ్‌ నాన్న కొత్త షెడ్యూల్‌ పూర్తి చేసింది. ఈ మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి , డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌ తెరకెక్కిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu