HomeTelugu Big StoriesGame Changer: రామ్ చరణ్ అభిమానుల..పుండు మీద కారం.. విషయమేమిటంటే..

Game Changer: రామ్ చరణ్ అభిమానుల..పుండు మీద కారం.. విషయమేమిటంటే..

Ram Charan Game Changer

Game Changer Update: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో శంకర్ కూడా ఒకరు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకి దర్శకత్వం వహించిన శంకర్ రెండు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి 1996లో విడుదలైన బ్లాక్ బస్టర్ అయిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న భారతీయుడు 2. మరొకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్.

ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాలతో శంకర్ చేసిన రెండు పడవల ప్రయాణం అంతగా వర్కౌట్ అవ్వలేదని చెప్పుకోవాలి. సినిమా రిజల్ట్ పక్కన పెట్టేస్తే షూటింగ్ జరుగుతున్నంత సేపు అభిమానుల్లో ఆసక్తి కంటే ఆందోళన ఎక్కువగా ఉంది. భారతీయుడు 2 సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు రామ్ చరణ్ అభిమానులు, గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కమల్ హాసన్ అభిమానులు శంకర్ ను ట్రోల్ చేస్తూనే ఉన్నారు.

Game Changer Release:

అన్ని అవాంతరాలు తట్టుకొని శంకర్ భారతీయుడు 2 సినిమాని బాగానే పూర్తి చేశారు. వచ్చే నెల ఈ సినిమా విడుదలకి కూడా సిద్ధం అవుతుంది. దీంతో రామ్ చరణ్ సినిమా ఎప్పుడు విడుదల చేస్తారు అని శంకర్ పై రామ్ చరణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలదు అన్నట్టు శంకర్ ఇప్పుడు కొత్త ప్లాన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

భారతీయుడు 2 సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే గేమ్ చేంజర్ సినిమా విషయంలో కూడా శంకర్ ఇదే చేయాలని అనుకుంటున్నారట. గేమ్ చేంజర్ సినిమా లో చాలా లోతైన కథ ఉంటుందట. అలాంటి కథని మూడు గంటలలో చెప్పడం కష్టమని, అందుకే సినిమాని రెండు భాగాలుగా చేస్తే బాగుంటుందని శంకర్ ప్లాన్ చేస్తున్నారట.

సినిమాకి రెండవ భాగం ఉండటం వరకు బాగానే ఉంది కానీ శంకర్ మొదటి భాగం రిలీజ్ అయిపోయాక రెండవ భాగం కోసం ఇంకెన్నాళ్లు సమయం తీసుకుంటారు అని రామ్ చరణ్ అభిమానుల ప్రశ్న. ఒకవైపు భారతీయుడు 2 సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమాకి రెండవ భాగం షూటింగ్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. మరోవైపు గేమ్ చేంజర్ సినిమాకి కూడా రెండవ భాగం అంటే ఎలా తీస్తారు అని ఫాన్స్ తలబాదుకుంటున్నారు.

అయితే శంకర్ భారతీయుడు 2 రెండవ భాగం పూర్తయ్యాకే గేమ్ చేంజర్ సినిమా రెండవ భాగం గురించి ఆలోచించాలి. ఇది తలుచుకుంటేనే రామ్ చరణ్ అభిమానుల గుండెల్లో రాళ్లు పడుతున్నట్లు ఉంది. లేదు అంటే మళ్లీ రెండు సినిమాలని ఒకేసారి పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఈ రెండు ఆప్షన్స్ రామ్ చరణ్ అభిమానులకి ఏమాత్రం నచ్చలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu