HomeTelugu Trendingహీరోగా గాలి జ‌నార్ద‌న్ రెడ్డి తనయుడు.. టైటిల్‌ ఫిక్స్‌

హీరోగా గాలి జ‌నార్ద‌న్ రెడ్డి తనయుడు.. టైటిల్‌ ఫిక్స్‌

Gali janardhan reddy son ki

క‌ర్ణాట‌క మాజీ మంత్రి గాలి జ‌నార్ద‌న్ రెడ్డి తనయుడు గాలి కిరిటి త్వరలోనే గాలి కిరిటి కన్నడ, తెలుగు ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీనికి సంబంధించిన స్క్రీప్ట్‌ వర్క్‌, నటీనటుల ఎంపిక కూడా పూర్తయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే మూవీ సెట్స్‌పైకి రానుందంటూ తాజాగా చిత్ర బృందం అప్‌డేట్‌ ఇచ్చింది. యంగ్‌ డైరెక్టర్‌ రాధాకృష్ణ ప్ర‌ముఖ నిర్మాత‌ సాయి కొర్ర‌పాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘వారాహి’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు.

తెలుగు కన్నడ ద్విభాషా చిత్రంగా ప్రేమ, కుటుంబ కథా అంశాలను కలిపి రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభానికి సన్నాహాలు చేసుకుంటున్నది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తుండగా..కె సెంథిల్‌ కుమార్‌ సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకుంటున్నారు. పీటర్‌ హెయిన్‌ స్టంట్స్‌ సమకూర్చుతున్నారు. ఈ మూవీలో మిగతా నటీనటులను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాల‌న్న ఆలోచ‌న రాగానే దానిపైనే దృష్టి సారించిన కిరీటి స్వ‌దేశంతో పాటు విదేశాల్లోనూ ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ తీసుకున్నాడ‌ట‌. మొత్తంగా ఓ రేంజిలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న గాలి కిరీటి ఏ మేర జ‌నాల‌ను మెప్పిస్తారో చూడాలి.

‘రాధేశ్యామ్‌’ కొత్త ట్రైలర్‌

Recent Articles English

Gallery

Recent Articles Telugu