HomeTelugu Trending'దేవ‌ర' ఆడియో రైట్స్‌ సొంతం చేసుకున్న 'టీ సిరీస్'

‘దేవ‌ర’ ఆడియో రైట్స్‌ సొంతం చేసుకున్న ‘టీ సిరీస్’

NTR devara movie audio righ

జూనియర్ ఎన్టీఆర్ ఆర్‌ఆర్‌ఆర్‌ తరువాత నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాతో జాన్వీ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్‌ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా న‌టిస్తున్నాడు.

ఇప్ప‌టికే ఈ సినిమా విడుదలైన అప్డేట్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా సముద్ర నేపధ్యంలో తెరకెక్కుతుంది. ఈ క్రమంలో ఈ మూవీ ఫస్ట్‌గ్లింప్స్‌ సంక్రాంతి కానకగా జనవరి 08న విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఆడియో హ‌క్కులు భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయిన్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ప్ర‌ముఖ మ్యూజిక్‌ సంస్థ టీ సిరీస్ దేవ‌ర ఆడియో హ‌క్కుల‌ను భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది. అయితే ఎంత ధ‌ర‌కు అమ్ముడైన‌ విష‌యం మాత్రం మేక‌ర్స్ వెల్ల‌డించ‌లేదు. ఇక ఈ సినిమాకు త‌మిళ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ రవిచంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలిభాగం 2024 ఏప్రిల్ 5న విడుద‌ల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu