HomeTelugu Trendingబేబీ బంప్‌లో జెనీలియా.. షాక్‌లో ఫ్యాన్స్‌

బేబీ బంప్‌లో జెనీలియా.. షాక్‌లో ఫ్యాన్స్‌

Genelia with baby bump.. Ph

జెనీలియా గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగులో పలు సినిమాల్లో నటించింది. బొమ్మరిల్లు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు పెళ్లి తర్వాత సినీ కెరీర్ కు పూర్తిగా దూరం అయింది. ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చిన తర్వాత.. వారు కాస్త పెద్ద అయిన తర్వాత సోషల్ మీడియాలో సందడి మొదలు పెట్టింది. గత కొంత కాలంగా ఈ అమ్మడి సోషల్ మీడియా హడావుడి మామూలుగా లేదు.

ఇటీవలే ఈ అమ్మడు ‘వేద్‌’ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం తో సెకండ్ ఇన్నింగ్స్ లో జెనీలియా దూసుకు పోయే అవకాశాలు ఉన్నాయి అనుకున్నారు. హిందీ తో పాటు తెలుగు సినిమా ల్లో ఈమె సెకండ్‌ ఇన్నింగ్స్ తో దూసుకు పోనుందని భావిస్తున్న టైమ్‌లో ఓ షాకింగ్‌ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

తాజాగా భర్తతో కలిసి ఒక కార్యక్రమంలో జెనీలియా పాల్గొంది. ఆ సమయంలో జెనీలియా బేబీ బంప్ క్లీయర్‌ గా కనిపించింది. అంతే కాకుండా ఆమె తన బేబీ బంప్ పై జాగ్రత్తగా అన్నట్లుగా చేయి వేసుకుని మరీ పట్టుకుని ఉంది. దాంతో కచ్చితంగా జెనీలియా మూడవ సారి గర్భవతి అంటూ చాలా మంది వాదిస్తున్నారు. అయితే దీనిపై జెనీలియా స్పందించల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!