HomeTelugu Trending'గాడ్సే' ట్రైలర్‌

‘గాడ్సే’ ట్రైలర్‌

Godse movie teaser

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సత్యదేవ్‌ డైరెక్టర్‌ గోపీగణేశ్‌ పట్టాభి కాంబినేషన్‌లో తెరకెక్కిన పవర్‌ఫుల్‌ కథా చిత్రం ‘గాడ్సే’. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమా టీజర్‌ను సోమవారం మధ్యాహ్నం మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేశారు. ‘ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది.

‘సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులొస్తాయ్‌.. వ్యాపారం చేస్తే డబ్బులొస్తాయ్‌.. వ్యవసాయం చేస్తే డబ్బులొస్తాయ్.. కానీ, సేవ చేస్తున్నందుకు మీకు వంద, వేల, లక్షల కోట్లు ఎలా వస్తున్నాయ్‌? ఎందుకంటే సేవ పేరుతో మీరు ప్రజలు సొమ్ము దోచుకుంటున్నారు’ అంటూ టీజర్‌ చివర్లో సత్యదేవ్‌ చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. నాజర్, సాయాజీ షిండే, కిషోర్, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ, నాగబాబు, పృథ్వీరాజ్, తనికెళ్ళ భరణి వంటి సీనియర్ నటులు సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu