HomeTelugu Newsవివాదాల శ్రీరెడ్డి బయోపిక్‌తో మరో వివాదం..

వివాదాల శ్రీరెడ్డి బయోపిక్‌తో మరో వివాదం..

సంచలన నటి శ్రీరెడ్డి కాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలతో టాలీవుడ్‌, కోలీవుడ్‌ వర్గాల్లో అలజడి రేపిన సంగతి తెలిసిందే. కాగా ఈమె మరో సంచలనానికి తెరతీసింది. ‘రెడ్డి డైరీ’ పేరుతో ఆమె స్వీయ చరిత్రను తమిళంలో తెరకెక్కించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు సోమవారం చెన్నై ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శ్రీరెడ్డి మాట్లాడుతూ… తనను మోసగించిన వారి ఆధారాలు తన వద్ద ఉన్నాయని, సమయం వచ్చినపుడు వాటిని బయటపెడతానని హెచ్చరించింది. తాను నటించబోయే ‘రెడ్డి డైరీ’ చిత్రానికి సహకరించేందుకు నడిగర్‌ సంఘం హామీ ఇచ్చిందని చెప్పింది.

2 22

కాస్టింగ్‌ కౌచ్‌పై తన ఆరోపణల జాబితా కొనసాగుతుందని, తనను లైంగికంగా వాడుకున్న వారి వీడియో ఆధారాలన్నీ తన వద్దే ఉన్నాయని తెలిపింది. కాగా తెలిపింది. ‘రెడ్డి డైరీ’ చిత్రం ద్వారా వాటిని విడుదల చేయనున్నట్లు బాంబు పేల్చింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అల్లావుద్దీన్‌ మాట్లాడుతూ… శ్రీరెడ్డి జీవితంలో చోటుచేసుకున్న వాస్తవ సంఘటనల ఆధారంగా ‘రెడ్డి డైరీ’ని రూపొందిస్తున్నామని చెప్పారు. టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ పై స్టింగ్ ఆపరేషన్ తరహాలో ఈ చిత్రం సాగుతుందని కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే ఇన్ని వివాదాలు సృష్టించిన శ్రీరెడ్డి, తన బయోపిక్ తో ఇంకెన్ని వివాదాలు సృష్టిస్తుందో చూడాలి.

2a 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu