HomeTelugu Trendingపవన్ కల్యాణ్ అభిమానులకు శుభవార్త

పవన్ కల్యాణ్ అభిమానులకు శుభవార్త

Pawan Kalyan titleపవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు చిత్రబృందం ఓ శుభవార్త చెప్పింది. పవన్ కల్యాణ్ తాజా చిత్రం ఫస్ట్‌ లుక్, టైటిల్ శివరాత్రి కానుకగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. క్రిష్ దర్శకత్వంలో వర్కింగ్ టైటిల్ పీఎస్‌పీకే 27తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పీరియాడికల్ డ్రామాగా రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ ఓ పవర్ పుల్ పాత్రను పోషిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu