HomeTelugu Trendingడైరెక్టర్‌ శ్రీవాస్‌తో గోపీచంద్‌ హాట్రిక్‌ మూవీ!

డైరెక్టర్‌ శ్రీవాస్‌తో గోపీచంద్‌ హాట్రిక్‌ మూవీ!

Gopichand 30 movie with dir

టాలీవుడ్‌ హీరో గోపీచంద్‌ హీరోగా నటించిన ‘లక్ష్యం’ చిత్రంతో దర్శకులుగా పరిచయమైయ్యారు శ్రీవాస్‌. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్‌ కాంబినేషన్‌లో వచ్చి న మరో చిత్రం ‘లౌక్యం’ సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో హాట్రిక్‌ ఫిల్మ్‌ను బుధవారం అధికారికంగా ప్రకటించారు.

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పోస్టర్ ను కూడా విడుదల చేశారు. కెరియర్ పరంగా గోపీచంద్ కి ఇది 30వ చిత్రం. అలాగే ఈ సినిమా కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో మరింత ఆసక్తికరంగా సాగుతుందని తెలుస్తుంది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా టైటిల్‌ ఖరారు కావాల్సి ఉంది. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమా, త్వరలోనే రెగ్యులర్ షూటింగుకు వెళ్లనుంది. భూపతిరాజా అందించే కథ అందిస్తున్నారు.

గోపీచంద్‌ నటించిన సీటీమార్‌ సినిమా విడుదలకు సిద్థంగా ఉంది. ప్రస్తుతం గోపీచంద్ మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌‘పక్కా కమర్షియల్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిన వెంట‌నే ఆయన 30వ మూవీ షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. ఈ సినిమాకు గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu