HomeTelugu Trendingగోపీచంద్‌ 'భీమా' ఫస్ట్‌లుక్‌

గోపీచంద్‌ ‘భీమా’ ఫస్ట్‌లుక్‌

Gopichand Bhimaa first lo
గోపీచంద్‌ హీరోగా ప్రస్తుతం కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. చాలా రోజుల క్రితం ఈ సినిమాను ప్రకటించారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ సినిమా నుండి ఎటువంటి అప్డేట్‌ రాలేదు.

తాజాగా న్యూ ఇయర్‌ కానుకగా గోపీచంద్‌- హర్ష సినిమా ఫస్ట్‌ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాకి భీమా అనే టైటిల్ ఫిక్స్‌ చేశారు. ఈ సినిమాలో గోపీచంద్‌ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని గతంలోనే ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే.

తాజాగా పోలీస్‌ ఆఫీసర్ గెటప్ లో గోపీచంద్ ను చూపిస్తూ భీమా టైటిల్‌ తో పోస్టర్ ను విడుదల చేసి ప్రేక్షకులకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలను యూనిట్‌ సభ్యులు తెలియజేశారు. ప్రస్తుతం ఈ సినిమా యొక్క షూటింగ్‌ మంగళూరులో జరుగుతున్నట్లుగా యూనిట్ సభ్యులు తెలియజేశారు.

దట్టమైన అటవీ ప్రాంతంలో గోపీచంద్ మరియు కొందరి పై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ జరుపుతున్నారు. కేజీఎఫ్ మరియు సలార్‌ సినిమాలకు సంగీత దర్శకుడిగా చేసిన రవి బస్రూర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్‌ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

241141 sjb4gpew స

Recent Articles English

Gallery

Recent Articles Telugu