HomeTelugu Trendingగోపీచంద్‌ 'సీటీమార్‌' ఫస్ట్‌లుక్‌

గోపీచంద్‌ ‘సీటీమార్‌’ ఫస్ట్‌లుక్‌

2 25
హీరో గోపీచంద్‌, సంపత్‌ నంది దర్శకత్వంలో కబడ్డీ ఆట నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమన్నా, దిగంగనా సూర్యవంశీ ఈ చిత్రంలో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. షూటింగ్‌ శరవేగంగా జరుపుకుటున్న ఈ మూవీ టైటిల్‌ను, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. ముందుగా సోషల్‌మీడియాలో లీకువీరులు చెప్పినట్టుగానే ఈ సినిమాకు ‘సీటీమార్‌’ అనే టైటిల్‌నే ఫిక్స్‌ చేశారు. ఇక ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ కూడా ఆకట్టుకుట్టుంది. ఈ చిత్రంతో గోపిచంద్‌ కోచ్‌ పాత్ర చేస్తున్నారు.. అందుకు తగ్గట్టు మారారు. నెత్తిన టోపీ ధరించి, విజిల్‌ చేత పట్టుకొని ఆటగాళ్లను కూతకు సిద్దం చేస్తున్నట్లుగా పోస్ట్‌ర్‌లో గోపిచంద్‌ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెటిజన్లను ఆకర్షిస్తుంది.

తన 28వ సినిమాలో గోపీచంద్‌ ఆంధ్రాజట్టు కబడ్డీ టీమ్‌ కోచ్‌గా కనిపించనున్నారు. అంతేకాకుండా మిల్క్‌బ్యూటీ తమన్నా తెలంగాణ జట్టు కబడ్డీ టీమ్‌ కోచ్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. ఇక వరుస ఫెయిల్యూర్‌తో సతమతమవుతున్న గోపిచంద్‌ ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. భూమిక, రావురమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu