
Chiranjeevi next movie heroine:
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మరో సూపర్ న్యూస్ వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిరు కొత్త సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతి 2026కి రిలీజ్ కావాల్సిన ఈ మాస్ ఎంటర్టైనర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది.
ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన ఓ వార్త ఏంటంటే… ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా స్టార్ హీరోయిన్ నయనతారను తీసుకోవాలని మేకర్స్ ఫ్లాన్ చేస్తున్నారట. అయితే నయన్ మాత్రం పారితోషికంగా ఏకంగా రూ.18 కోట్ల డిమాండ్ చేసిందట. దీనితో నిర్మాతలు షాక్ అయి మళ్లీ ఇతర ఆప్షన్స్ కూడా పరిశీలిస్తున్నారని టాక్.
ఇది సెటిల్ అయితే, నయనతార-చిరంజీవి కాంబినేషన్‌కు ఇది మూడోసారి అవుతుంది. ‘సైరా నరసింహారెడ్డి’, ‘గాడ్‌ఫాదర్’ తర్వాత ఇప్పుడు మరోసారి ఈ జంట స్క్రీన్‌పై సందడి చేయనుంది. నయన్ కెరీర్ పరంగా చూస్తే కూడా ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది.
ఈ సినిమాను శైన్ స్క్రీన్స్ అధినేత సహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత్రి సుష్మిత కొణిదెల కలిసి నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా భీమ్స్ సిసిరోలియో ఎంపికయ్యారు. మరి నయనతార డిమాండ్ మేకర్స్ కట్టిపడుతారా? లేదంటే మరో హీరోయిన్‌కు ఛాన్స్ ఇస్తారా? అన్నది చూడాలి. ఏది జరిగినా, చిరు సినిమాపై మాత్రం మాస్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.
తక్కువ టైంలో షూటింగ్ కంప్లీట్ చేసి, సూపర్ కంటెంట్‌తో చిరు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాలని టీమ్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.













