
Vishwak Sen controversies:
విశ్వక్ సేన్ కెరీర్ ఆరంభంలోనే తన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫలక్నుమా దాస్, పాగల్ వంటి సినిమాలు అతనికి ప్రత్యేకతను తెచ్చాయి. కానీ ఇటీవల విశ్వక్ సేన్ సినిమాల కంటే ఆయన ప్రవర్తన, మాటలే ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి.
విశ్వక్ సేన్ తాజా చిత్రం లైలా ప్రమోషన్స్‌లో కొన్ని వివాదాస్పద సందర్భాలు చోటు చేసుకున్నాయి. మీడియా ఇంటరాక్షన్స్‌లో యూట్యూబర్ల నుండి వచ్చిన పిచ్చి ప్రశ్నలు అతని మాటలు కొత్త చర్చలకు దారి తీసాయి. కేపీహెచ్‌బీ ఆంటీలా లైలా గెటప్ ఉందంటూ ఓ యూట్యూబర్ చేసిన కామెంట్ కి విశ్వక్ సేన్ ఇచ్చిన డబుల్ మీనింగ్ సమాధానం ఇప్పుడు నెటిజన్లలో హాట్ టాపిక్ అయ్యింది.
సినిమా ప్రమోషన్లలో మితిమీరుతున్న ప్రశ్నలు
లైలా కేపీహెచ్‌బీ ఆంటీలా ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందన్న జర్నలిస్ట్
ఇంటర్నేషనల్ ఫిగర్‌ను కేపీహెచ్‌బీ ఆంటీ అంటారా ఎంత అన్యాయం రా అంటూ సమాధానమిచ్చిన హీరో విశ్వక్ సేన్ pic.twitter.com/cU5O9x2Qrh
— Telugu Scribe (@TeluguScribe) January 24, 2025
మూవీ ప్రమోషన్స్ అనేవి సాధారణంగా సినిమాను ప్రమోట్ చేసేందుకు ఉంటాయి. కానీ విశ్వక్ సేన్ విషయంలో అతని చెప్పే మాటలే ప్రధాన చర్చకు దారి తీస్తున్నాయి. ‘లైలా గెటప్‌లో ఒంటరిగా తిరగొద్దు’ అని బాలకృష్ణ చెప్పినట్లు విశ్వక్ సేన్ చెప్పడం, మరీ ముఖ్యంగా ‘లైలా ఫోటోని చూసి ఏం చేసుకోకండి’ అని ఆయన వ్యాఖ్యానించడం వివాదాలకు దారి తీసింది.
విశ్వక్ సేన్ ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. “పిచ్చి ప్రశ్నలు అడిగేవాళ్లు ఓకే. కానీ, సమాధానం చెప్పే అతనికి బాధ్యత ఉండాలి కదా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి చర్చలు విశ్వక్ సేన్ స్థాయిని దిగజారుస్తున్నాయని అంటున్నారు.
సినిమా ప్రమోషన్‌లో ప్రశ్నలకే కాదు, వాటికి ఇచ్చే సమాధానాలకు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తనలో మార్పు లేకుంటే, విశ్వక్ సేన్ కెరీర్ మీద దీని ప్రభావం ఉండవచ్చు అని ఫ్యాన్స్ వాదన.
ALSO READ: Akshay Kumar ముంబై లో తన ఫ్లాట్ ఎంతకి అమ్మారో తెలుసా?