
Bigg Boss 8 Telugu Voting:
బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ రోజు రోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇంట్లో గొడవలు అంచనాలకు విరుద్ధంగా ఉంటున్నాయి. ఇంట్లో సభ్యుల మధ్య పోటీ కష్టంగా మారినప్పటికీ, అగ్రస్థానంలో ఉండాలి అనుకున్నవారు ఓటింగ్ లో వెనుకబడుతున్నారు.
ఇక మరొక వైపు, కొందరు సభ్యులకు నచ్చని సెలబ్రిటీ అయిన విష్ణు ప్రియ కు మాత్రం బలమైన ఓట్లు వస్తున్నాయి. ప్రేక్షకుల నుండి విష్ణు ప్రియకు వస్తున్న ఈ మద్దతు ఆమెకున్న ఆదరణకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇతర పోటీదారుల కంటే విష్ణు ప్రియకు ఓట్లలో భారీ వ్యత్యాసం ఉండటం ఆమె సంపాదించుకున్న పాపులారిటీ కారణంగానే అని చెప్పచ్చు.
ఇంట్లో పృథ్వితో రొమాంటిక్ గా వ్యవహరిస్తున్న విష్ణు ప్రియకు ఇది ముఖ్యమైన అంశంగా మారింది. వారి మధ్య నడుస్తున్న సన్నిహితత వల్ల ఆమె హౌస్ లో ఎక్కువగా పృథ్వితోనే కనిపిస్తూ ఉంది. ఈ ప్రవర్తన ఇంట్లోని ఇతర సభ్యులకు అంతగా నచ్చకపోయినా, విష్ణు ప్రియ మాత్రం ప్రేక్షకుల మద్దతును పొందుతూ మొదటి స్థానంలో ఉంది.
ఈ వారం విష్ణు ప్రియ నామినేట్ అయినప్పటికీ, ఆమెకు వస్తున్న భారీ ఓట్ల వలన ఆమె ఎలిమినేషన్ నుంచి బయటకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితులు చూస్తుంటే, ఆమెకు ప్రేక్షకుల మద్దతు పెరుగుతూనే ఉంది. ఇలానే ఆమె టైటిల్ కూడా కొట్టేస్తుందా అని ప్రశ్నలు మొదలయ్యాయి.
ALSO READ: Diwali Box Office Winners జాబితాలో టాప్ లో ఉన్న సినిమా ఏంటో తెలుసా?













