HomeTelugu Trendingఆ మేకప్‌ కోసం మూడు గంటలు పట్టేది: అమితాబ్‌ బచ్చన్‌

ఆ మేకప్‌ కోసం మూడు గంటలు పట్టేది: అమితాబ్‌ బచ్చన్‌

4 5‘గులాబో సితాబో’ మూవీ కోసం రోజుకు మూడు గంటలపాటు మేకప్‌ వేసుకోవాల్సి వచ్చేదని బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ తెలిపారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఇది. దర్శకుడు సూజిత్‌ సర్కార్‌ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమాలో అమితాబ్‌ లుక్‌ను చూసి ఫ్యాన్స్‌ సర్‌ప్రైజ్‌ అయ్యారు. ప్రచార చిత్రంలో బిగ్‌బి నెరిసిన గుబురు గడ్డం, కళ్లజోడుతో, తలచుట్టూ వస్త్రం కప్పుకుని, వదులుగా ఉండే చొక్కాతో వృద్ధాప్య ఛాయలు ఎక్కువగా ఉన్నట్లు కనిపించారు. ఈ పాత్రలో ఆయన అందర్నీ నవ్వించనున్నారట.

అయితే ఈ పాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని అమితాబ్‌ ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘ఈ లుక్‌లో సిద్ధం కావడానికి ప్రతిరోజూ మూడు గంటలు పట్టేది. అంతా పూర్తయిన తర్వాత చివరికి నా పరిస్థితి ఇది’ అని పోస్ట్‌ చేశారు. దీంతోపాటు మేకప్‌ రూమ్‌లో తీసిన ఫొటోను షేర్‌ చేశారు. కుటుంబ హాస్య చిత్రంగా ‘గులాబో సితాబో’ను రూపొందిస్తున్నారు. అమితాబ్‌తోపాటు ఆయుష్మాన్‌ ఖురానా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu