HomeTelugu Trendingసత్యదేవ్ 'గువ్వ గోరింక' ట్రైలర్‌

సత్యదేవ్ ‘గువ్వ గోరింక’ ట్రైలర్‌

Guvva Gorinka Movie Trai
టాలీవుడ్‌ యువ నటుడు సత్యదేవ్ – ప్రియాలాల్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ”గువ్వ గోరింక”. రామ్ గోపాల్ వర్మ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన మోహన్ బమ్మిడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆకార్ మూవీస్ బ్యానర్ పై జీవన్ రెడ్డి – దాము సంయుక్తంగా నిర్మించారు. సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 17న అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా “గువ్వ గోరింక’ ట్రైలర్ ని శనివారం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ ట్రైలర్ చూస్తుంటే సత్యదేవ్ మరోసారి తన నటనతో ఆకట్టుకోనున్నాడని అర్థం అవుతోంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు కనిపిస్తుంది. ఇందులో ప్రియదర్శి – రాహుల్ రామకృష్ణ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. మానవ సంబంధాలను యువత ఎలా చూస్తున్నారన్న అంశాలతో తెరకెక్కిన ‘గువ్వ గోరింక’ ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకునేలా ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu