
టాలీవుడ్‌లో.. ‘దేశముదురు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ హన్సిక. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోలతో జతకట్టి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న హాన్సికకు ఆ తర్వాత అవకాశాలు కరువయ్యాయి. దీంతో ఆమె కోలీవుడ్‌పై ఫోక్‌స్ పెట్టింది. లేడీ ఓరియంటెడ్, గ్లామర్ రోల్స్ పోషిస్తూ తమిళంలో వరుస ఆఫర్లు అందుకుంటోంది. రెండేళ్ల గ్యాప్ అనంతరం ఆమె నటించిన తాజా చిత్రం ‘మహా’. త్వరలోనే ఈ సినిమాతో తమిళ ప్రేక్షకులను పలకరించబోతోంది ఆమె. ఇప్పుడిప్పుడే మళ్లీ అవకాశాలను అందుకుంటున్న హాన్సిక ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైందని తమిళ మీడియాల్లో వార్తలు గుప్పుమన్నాయి.
సౌత్‌కు చెందిన ఓ బడా పోలిటీషియన్ కుమారుడితో ఏడడుగులు వేసేందుకు హన్సిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఫిలిం దూనియా టాక్. అయితే ఆమె కాబోయే భర్త వ్యాపార రంగంలో రాణిస్తున్నట్లు సన్నిహితవర్గాల నుంచి సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబాలు కలిసి చర్చించుకున్నారని, అతిత్వరలోనే నిశ్చితార్థానికి తేదీ కూడా ఫిక్స్ చేయనున్నారని వినికిడి. ఇక దీనిపై హాన్సిక త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఇవ్వబోతుందని సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే హన్సిక స్పందించే వరకు వేచి చూడక తప్పదు.













