
Coolie Movie Update:
రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘కూలీ’ సినిమా ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ రికార్డ్ స్థాయిలో అమ్ముడయ్యాయి. ఇప్పుడు ఓవర్సీస్ రైట్స్ కూడా భారీ ధరకు డీల్ క్లోజ్ అయింది.
రూ. 81 కోట్లు ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్‌కు తీసుకెళ్లారంటే ఈ సినిమాపై ఉన్న హైప్ అర్థం చేసుకోవచ్చు. ఇది అన్ని భాషల ఓవర్సీస్ రైట్స్‌కి కూడగట్టిన మొత్తం. ముఖ్యంగా తెలుగు, తమిళ రైట్స్ కోసం భారీ పోటీ జరుగుతోందట.
‘కూలీ’ కథ మాత్రం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యం ఉంటుందని సమాచారం. ఇందులో రజనీకాంత్‌కి తోడు నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహీర్, శత్యరాజ్, శృతి హాసన్, జూనియర్ ఎంజీఆర్, రెబా మోనికా జాన్ వంటి స్టార్ క్యాస్టింగ్ కనిపించనుంది.
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు మాస్ బీట్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమవుతున్నాడు అనిరుధ్.
ఈ మూవీని ఆగస్టు 14న పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుంది. ఈ కాంబోపై క్రేజ్, రికార్డ్ డీల్‌లు చూస్తే సినిమా బాక్సాఫీస్‌పై తుపాను లాంటి ప్రభావం చూపనుందని చెప్పొచ్చు.