HomeTelugu Trending'హనుమాన్‌' టీజర్‌ అప్డేట్‌

‘హనుమాన్‌’ టీజర్‌ అప్డేట్‌

Hanuman movie update

ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘హనుమాన్‌’. యువ నటుడు తేజా సజ్జా హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ జరపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు, గ్లింప్స్‌ ప్రేక్షకులలో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ గాని, టీజర్‌ గాని ఇప్పటివరకు రాలేదు. ఈ క్రమంలో దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఈ మూవీ టీజర్‌కు సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను ప్రకటించాడు.

హనుమాన్‌ టీజర్‌ డేట్‌ను నవంబర్‌ 7న రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపాడు. కాగా ఈ సినిమా టీజర్‌ దసరా కానుకగా రిలీజ్‌ చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. కానీ ఆదిపురుష్ టీజర్‌ రావడంతో పోస్ట్‌ పోన్‌ చేశారు. అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలకపాత్ర పోషిస్తుంది. డాక్టర్‌ ఫేం వినయ్‌రాయ్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu