హ్యాపీ బర్త్ డే త్రివిక్రమ్

ఖలేజా, జులాయి, జల్సా, సన్నాఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది, అ ఆ, ఇటీవలే వచ్చిన అరవింద సమేత సినిమాతో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎంత ఎదిగినా ఒదిగివుండే తత్త్వం త్రివిక్రమ్ ది. ఈ రోజు నవంబర్ 7 న త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే పుట్టినరోజు.

సినిమా రంగం అంటే రంగుల ప్రపంచం. చేతిలో ఎంత వర్త్ ఉన్నా.. దానికి లక్ కూడాఉండాలి. వెనక ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకపోయినా, కలాన్ని నమ్ముకొని కాలానికి ఎదురుగా ముందుకు సాగాడు. చిన్న చిన్న అవకాశాలను సద్వినియోగం చేసుకున్న త్రివిక్రమ్..మాటల రచయితగా మంచిపేరు తెచ్చుకోవడమే కాకుండా.. మాటల యొక్క గొప్పతనంతో.. స్టార్ హీరోలు, దర్శకుడు పొందిన స్థాయిని అందుకున్నాడు. తొలిసినిమా నువ్వే నువ్వే తో దర్శకుడిగా తన తాను నిరూపించుకున్న త్రివిక్రమ్.. అతడు సినిమాతో తన స్థాయి ఏమిటో.. తన సినిమా ఎలా ఉంటుందో సినిమా రంగానికి చూపించాడు. ఈరోజు త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన సమాచారం వెలువడుతుందని తెలుస్తున్నది. త్రివిక్రమ్ ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీయాలని కోరుకుందాం.