‘ఎన్టీఆర్‌’ లో సావిత్రి ఈమేనట..!

సహజ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మహానటి’. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తిసురేష్ నటించిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్‌ ముందుగా నిత్యమీనన్‌ దగ్గరకే వెళ్లిందట. కానీ అనివార్య కారణాల వల్ల నిత్య మహానటి సినిమాలో నటించలేకపోయింది. అయితే తాజాగా సావిత్రి పాత్ర మరోసారి నిత్యను వెతుక్కుంటూ వచ్చిందట.

ఎన్టీఆర్‌ జీవిత కథ ఆధారంగా నందమూరి బాలకృష్ణ ‘యన్‌.టి.ఆర్‌’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సావిత్రి పాత్రకు నిత్యమీనన్‌ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. మాయబజార్‌, మిస్సమ్మ, రక్తసంబంధం లాంటి అద్భుత చిత్రాలకు సంబంధించిన సన్నివేశాలను యన్‌.టి.ఆర్‌లో చూపిస్తున్నారు. ఈ సీన్స్‌లో సావిత్రిగా నిత్య మీనన్‌ కనిపించనుంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. నిత్య మీనన్‌, సావిత్రి పాత్రలో కనిపించటం కన్ఫమ్‌ అన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌ నుండి ప్రముఖ నటులు పలు కీలక పాత్రల్లో నటించానున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.