HomeTelugu Trendingహ్యీపీ బర్త్‌డే.. టీజర్‌ విడుదల

హ్యీపీ బర్త్‌డే.. టీజర్‌ విడుదల

Happy Birthday Movie Teaser

అందాల భామ లావణ్య త్రిపాఠి నటిస్తున్న తాజా యాక్షన్ క్రైమ్ కామెడీ మూవా ”హ్యాపీ బర్త్ డే”. ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి క్లాప్ ఎంటర్టైన్మెంట్ ప్రతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘హ్యాపీ బర్త్ డే’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘హ్యాపీ బర్త్ డే’ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీజర్ ని రిలీజ్‌ చేశారు.

ఇది డైరెక్టర్ రితేష్ రానా మార్క్ సర్రియల్ కామెడీ థ్రిల్స్ మరియు యాక్షన్ తో కూడిన సినిమా అని అర్థం అవుతుంది. కాళ భైరవ సంగీతం అందించారు. జూలై 15 ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని & రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ) మరియు హేమలత పెదమల్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu