క్రిస్మస్‌ సంబరాల్లో సమంత!

స్టార్‌ హీరోయిన్‌ సమంత క్రిస్మస్‌ సంబరాల్లో మునిగితేలుతున్నారు. సంవత్సరం మొత్తంలో డిసెంబర్‌ అంటే తనకు చాలా ఇష్టమని ఆమె ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు. ప్రతి ఏడాది క్రిస్మస్ ట్రీను అందంగా అలంకరించిన ఫొటోలను ఆమె ఉత్సాహంగా అభిమానులకు షేర్‌ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా సామ్‌ ఫొటోలను పంచుకున్నారు. క్రిస్మస్‌ ట్రీను అలంకరించడానికి స్నేహితులు ప్రీతమ్‌ జుకల్కర్‌ (ఫ్యాషన్‌ డిజైనర్‌), సద్నా సింగ్‌ (మోడల్‌) సహాయం చేశారు.

ఇద్దరు తన క్రిస్మస్‌ ట్రీను అలంకరిస్తున్నారని సామ్‌ అన్నారు. ఏడాదిలో చాలా అందమైన నెల ఇదంటూ రెండు ఫొటోలను పోస్ట్‌ చేశారు. సమంత ‘సూపర్‌ డీలెక్స్‌’ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.‌ ‌ప్రస్తుతం ఆమె తన భర్త నాగచైతన్యతో కలిసి ‘మజిలీ’ లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో చై-సామ్ భార్యాభర్తల పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉన్నట్లు సమాచారం.

View this post on Instagram

My evil twin 😎 @sadhnasingh1

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on