HomeTelugu Trending'ఎల్‌.కె.జి' ట్రైలర్‌

‘ఎల్‌.కె.జి’ ట్రైలర్‌

LKG Telugu Trailer

ఆర్జే బాలాజీ కీలక పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘ఎల్‌.కె.జి’. ప్రియా ఆనంద్‌ హీరోయిన్‌. కె.ఆర్‌. ప్రభు డైరెక్షన్‌ లో వచ్చిన ఈ సినిమా 2019లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్‌ అందుకుంది. రాజకీయ వ్యంగ్య చిత్రంగా మంచి టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగులో ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా ‘ఎల్‌.కె.జి.-2020’ పేరుతో జూన్ 25నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘నేను పవర్‌స్టార్‌కు అభిమానిని. ఆయన సినిమాలు చూస్తే, ఆ పార్టీలో చేరతానా’ అంటూ ఆర్జే బాలాజీ పలుకుతున్న సంభాషణలు అలరిస్తున్నాయి. ప్రస్తుత రాజకీయాలను వ్యంగ్యంగా ప్రశ్నిస్తూ సినిమాను తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. మరి ఆ నవ్వుల పువ్వులు చూడాలంటే జూన్‌ 25 వరకూ వేచి చూడాల్సిందే!

Recent Articles English

Gallery

Recent Articles Telugu