HomeTelugu Trendingగ్యాంగ్‌ స్టార్‌ కథతో హ్యాపీ డేస్ రాహుల్‌!

గ్యాంగ్‌ స్టార్‌ కథతో హ్యాపీ డేస్ రాహుల్‌!

Happy Days Hero Rahul Harid

టాలీవుడ్‌లో హ్యాపీ డేస్ సినిమా తో ఎంట్రీ ఇచ్చిన నటుడు రాహుల్. ఈ సినిమాలో బక్కగా కనిపించిన రాహుల్ కొన్నాళ్ల గ్యాప్ తర్వాత టైసన్ మాదిరిగా మారిపోయాడు. సిక్స్ ప్యాక్ బాడీ.. కండలు.. మీసాలు గుర్తుపట్టనంతగా మారిపోయాడు. ఇటీవలే రాహుల్ సినిమా ఒకటి కన్ఫర్మ్ అయ్యింది. హైదరాబాద్ కు చెందిన గ్యాంగ్ స్టార్ అజీజ్ రెడ్డీ కథాంశంతో ఒక సినిమా ను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సినిమాకు ఇంకా టైటిల్ ను ఫిక్స్‌ కాలేదు. ఈ సినిమాలో రాహుల్ పాత్ర ఏంటీ అనే విషయమై ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. మొత్తానికి అజీజ్ కథతో ఈ సినిమా రూపొందబోతుందని మేకర్స్ చెబుతున్నారు. 2008 లో ఎన్‌కౌంటర్ లో మృతి చెందిన అజీజ్ కు ఎన్నో కేసులతో సంబంధం ఉంది. చివరకు 1993 లో జరిగిన ముంబయి పేళ్లుడుకు కూడా అతడి హ్యాండ్ ఉన్నట్లుగా పోలీసులు ఆ సమయంలో పేర్కొన్నారు. అంతటి డేంజరస్ అజీజ్ రెడ్డీ బయోపిక్ అంటే వివాదాలు మరియు కాస్త బెదిరింపులు కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు. అయినా కూడా ధైర్యంగా ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్దం అయ్యారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu