HomeTelugu Trendingపాపకు నామకరణం చేసిన హరితేజ

పాపకు నామకరణం చేసిన హరితేజ

Hari teja announced her bab
నటి హరితేజ ఇటీవలే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె తన ఇంట్లో కూతురి బారసాల ఫంక్షన్‌ జరిపింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూతురి ఫొటోను షేర్‌ చేసింది. ఈ ఫొటోలో పాప ముఖం మాత్రం క్లారిటీగా చూపించలేదు. హరితేజ తన కూతురికి భూమి దీపక్‌రావు అని నామకరణం చేసినట్లు వెల్లడించింది. “మా అమ్మానాన్న నాకు భూమి దీపక్‌ రావు అని పేరు పెట్టారు. భూమి అంటే చాలా సహనంతో ఉంటుందనుకుంటున్నారేమో.. కానీ వాళ్లకేం తెలుసు.. సహనాన్ని పరీక్షిస్తే భూకంపాలే అని.. మీరందరూ నన్ను భూమి అని పిలవచ్చు” అంటూ క్రేజీ క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. టీవీ షోల్లో యాకంర్‌గా చేసిన హరితేజ.. పలు సినిమాల్లోని నటించి తన సత్తా చాటుకుంది. ఇక బిగ్‌బాస్‌ షోతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu