HomeTelugu Trending'భీమ్లా నాయక్'పై హరీశ్‌ శంకర్‌ రివ్యూ

‘భీమ్లా నాయక్’పై హరీశ్‌ శంకర్‌ రివ్యూ

Harish shankar review on bh
పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘భీమ్లా నాయక్’. నేడు ఈ సినిమా విడుదలై సందడి చేస్తుంది. తొలి షోతోనే ఈ చిత్రం హిట్ టాక్ ను తెచ్చుకుంది. సినిమా సూపర్ హిట్ అంటూ పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాని డైరెక్టర్‌ హరీశ్ శంకర్ వీక్షించారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ సినిమా అదిరిపోయిందని చెప్పారు. కొంచెం గ్యాప్ తర్వాత గర్జించే పవన్ కల్యాణ్ ని చూశానని అన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకుడు సాగర్ చంద్ర పనితీరు అద్భుతంగా ఉందని కితాబునిచ్చారు. తమన్ కెరీర్ లో ది బెస్ట్ ఇచ్చాడని ప్రశంసించారు. ఇది కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోరు మాత్రమే కాదని, భీమ్లా నాయక్ కు బ్యాక్ బోన్ అని చెప్పారు. ఈ చిత్రంలో తాను రానాను చూడలేదని, కేవలం డేనియల్ శేఖర్ ని మాత్రమే చూశానని అన్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌కు జంటగా నిత్యామీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటించారు. రావు రమేశ్, మురళి శర్మ, సముద్ర ఖని ప్రధాన పాత్రలను పోషించారు.

Bheemla Nayak Theatrical Trailer | Pawan Kalyan, Rana Daggubati

Recent Articles English

Gallery

Recent Articles Telugu