పాత్ర నచ్చితే పారితోషికం తగ్గిస్తా!

దక్షిణాది సినిమాల్లో అగ్ర హీరోయిన్ గా వెలుగొందుతోన్న భామ సమంత. ‘అ ఆ’ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న సామ్ రీసెంట్ గా సావిత్రి బయోపిక్ లో ఓ ముఖ్య పాత్రలో నటించడానికి అంగీకరించింది. ఇది ఇలా ఉంటే అవసరమైతే తన పారితోషికం తగ్గించుకోవడానికి సిద్ధంగా
ఉన్నానని అంటోంది. టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతోన్న సమంతకు రెమ్యూనరేషన్ తగ్గించుకోవాల్సిన అవసరం ఏంటి అనుకుంటున్నారా..?

డిమాండ్ ఉన్న హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అనిపించుకుంటోన్న సమంతకు రెగ్యులర్ స్టోరీలు, పాత్రలు చేయడం
అసలు నచ్చట్లేదట. అందుకే ఆసక్తి గల కథనం, కొత్తగా ఉండే పాత్రలతో ఎవరైనా.. ముందుకొస్తే ఆ పాత్ర కోసం తన పారితోషికాన్ని తగ్గించుకోవడానికి రెడీగా ఉన్నానని చెప్పకనే చెబుతోంది. మరి సమంత నిర్ణయం తెలుసుకున్న మన రచయితలు తన కోసం కథలు రాసుకుంటారెమో చూడాలి!