HomeTelugu Big Storiesస్విమ్మింగ్‌లో రికార్డు నెలకొల్పిన గౌతమ్‌

స్విమ్మింగ్‌లో రికార్డు నెలకొల్పిన గౌతమ్‌

Gautam ghattamaneni create
టాలీవుడ్‌ సూపర్‌ మ‌హేష్‌ బాబు- న‌మ్ర‌తా శిరోద్క‌ర్ దంప‌తుల కుమారుడు గౌత‌మ్ స్విమ్మింగ్‌లో రికార్డు నెల‌కొల్పాడు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టాప్ 8 ఈత‌గాళ్ల జాబితాలో స్థానం సంపాదించి, శెభాష్ అనిపించుకున్నాడు. ఈ విష‌యాన్ని సోషల్‌ మీడియా వేదిక‌గా ఫ్యాన్స్‌తో పంచుకుంటూ త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశారు న‌మ్ర‌తా. 2018లో ఫ్రొఫెష‌న‌ల్ స్విమ్మర్‌గా మారిన‌ గౌత‌మ్ 15 ఏళ్ల వ‌య‌సులోనే ఈ ఘ‌న‌త సాధించాడు. గౌత‌మ్‌.. 3 గంట‌ల్లో 5 కి.మీ. దూరాన్ని ఈద‌గ‌ల‌డ‌ని, బ‌ట‌ర్ ఫ్లై, బ్యాక్ స్ట్రోక్‌, బ్రెస్ట్ స్ట్రోక్‌, ఫ్రీ స్టైల్ అనే నాలుగు ప‌ద్ధ‌తుల్లో ఈత కొడ‌తాడ‌ని తెలిపారు న‌మ్ర‌తా. ‘1 నేనొక్క‌డినే’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు గౌత‌మ్. మ‌హేష్‌ బాబు హీరోగా సుకుమార్ తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఇందులో చిన్న‌ప్ప‌టి మహేష్‌ బాబు పాత్రలో గౌత‌మ్ కనిపించాడు‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu