HomeTelugu Trendingహలో డార్లింగ్స్‌ మీ కోసం ఓ సర్‌ఫ్రైజ్ అంటున్న ప్రభాస్

హలో డార్లింగ్స్‌ మీ కోసం ఓ సర్‌ఫ్రైజ్ అంటున్న ప్రభాస్

6 18
బాహుబలి 2 బ్లాక్‌బస్టర్‌ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో ఇప్పటికే చాప్టర్‌-1, చాప్టర్-2 అంటూ ఈ సినిమా మేకింగ్‌ వీడియోలను చిత్ర బృందం విడుదల చేసింది. కాగా మే 21న సాహో సర్‌ప్రైజ్‌ ఉందంటూ ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్‌ చేశారు. తన సోషల్‌మీడియా ఖాతాలో దాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. దీనికి రానా రిప్లై ఇచ్చారు. సర్‌ప్రైజ్‌ కోసం ఎదురుచూస్తున్నా..అని పోస్ట్‌ చేశారు. బహుశా.. మంగళవారం సినిమా టీజర్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో సినిమాలో బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. నీల్‌ నితిన్‌ ముకేష్‌, వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu