HomeTelugu Trendingహద్దులు చెరిపేస్తున్న 'అందాల రాక్షసి'!

హద్దులు చెరిపేస్తున్న ‘అందాల రాక్షసి’!

9 10
టాలీవుడ్‌లో ‘అందాల రాక్షసి’ సినిమా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. ఈ సినిమా లో తన క్యూట్ నటనతో అందర్ని ఆకట్టుకుంది ఈ అమ్మడు. లావణ్య అందానికి కుర్రకారు దాసోహం అయ్యారనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన సినిమాలు పెద్దగా ఆడకపోయినా ఈ బ్యూటీకి ఆఫర్లు మాత్రం తగ్గలేదు. అయితే నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో హిట్ అందుకున్న స్టార్‌ హీరోల సరసన నటించే ఛాన్స్ మాత్రం రాలేదు. నాగార్జున సరసన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా చేసిన ఆ హిట్‌ నాగ్ ఖాతాలోకే వెళ్లిపోయింది. దాంతో లావణ్యను అంతగా పట్టించుకోలేదు.

మరో వైపు కొత్త భామలు టాలీవుడ్ కు పరిచయం అవుతున్న నేపథ్యంలో ఈ అమ్మడు తన అందానికి పెంచే పనిలోపడింది. ఇప్పటివరకు అమ్మడు అంతగా స్కిన్ షో చెయ్యలేదు. గ్లామర్ షోకు అమ్మడు పెద్దగా అంగీకరించలేదు. లావణ్యకు ఆఫర్లు తగ్గడానికి ఇదికూడా ఒక కారణమనే వార్తలు వచ్చాయి. దాంతో ఇక పై అందాల ఆరబోతకు హద్దులు చెరపాలని నిర్ణయించుకుందట. హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తుంది. ఇవి చూసైనా స్టార్ హీరోలు ఈ అమ్మడికి అవకాశం ఇస్తారేమో.

Recent Articles English

Gallery

Recent Articles Telugu