మహేష్‌బాబు నెక్ట్స్‌ విలన్‌ అతనే..

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా చేస్తున్న 25 వ సినిమా మహర్షి మే 9 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రేపు ఈ సినిమాలోని నాలుగో సింగిల్ రేపు రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమా విడుదల తరువాత వచ్చే నెలలో ప్రారంభం అవుతుంది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.

ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. ఇదిలా ఉంటె, ఇందులో విలన్ గా టాలీవుడ్ స్టార్ నటుడు జగపతిబాబును తీసుకున్నారు. మహేష్ తో జగపతిబాబుకు ఇది మూడో సినిమా. శ్రీమంతుడు సినిమాలో మహేష్ కు తండ్రిగా యాక్ట్ చేశాడు. మహర్షిలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మహేష్ 26 వ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు.