
Vijay Deverakonda Kingdom Budget:
టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండకు ఇప్పుడు ఒక బ్లాక్‌బస్టర్ హిట్ అవసరం. తన గత కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో పని చేయకపోవడంతో టాలీవుడ్ రేసులో మళ్లీ నిలబడడానికి ఆయన పూర్తి స్థాయిలో Kingdom సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలోకి grandగా విడుదల అవుతోంది.
Kingdom సినిమా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోంది. ఇదివరకే “జెర్సీ” వంటి హిట్ సినిమాను తెరకెక్కించిన గౌతమ్ మీద నిర్మాత నాగ వంశీకి భరోసా ఎక్కువ. అందుకే రిస్క్ తీసుకుని భారీ బడ్జెట్ పెట్టారు. అసలు Kingdom సినిమా ప్రారంభంలో ప్లాన్ చేసిన బడ్జెట్ కంటే ఇది చాలా ఎక్కువైంది. వంశీ చెప్పినట్టే, డిలేలు, ప్రొడక్షన్ ఖర్చులు పెరగడం వల్ల బడ్జెట్ 15-20 శాతం పెరిగింది. ఫైనల్‌గా రూ.130 కోట్ల వరకు వెచ్చించామని వెల్లడించారు.
ఈ బడ్జెట్ విజయ్ మార్కెట్‌కు బాగా మించిపోయిందని కూడా వంశీ ఓపెన్‌గా చెప్పారు. కానీ గౌతమ్ మీద ఉన్న నమ్మకంతోనే ఇలా పెట్టుబడి పెట్టారని వివరించారు. సినిమాకు సంగీతాన్ని అనిరుధ్ రవిచంద్రన్ అందిస్తుండటం మరో ప్లస్ పాయింట్. ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే ట్రైలర్‌లో చక్కగా పనిచేసింది.
ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేయడం, థియేట్రికల్ రైట్స్ కూడా మంచి రేట్లకు అమ్ముడుపోవడం Kingdom సినిమాపై బజ్‌ను పెంచుతున్నాయి. కానీ, ఈ సినిమా థియేటర్లలో హిట్ అవ్వాల్సిన అవసరం ఉంది. లేదంటే రూ.130 కోట్ల పెట్టుబడిని వెనక్కి తీసుకోవడం చాలా కష్టమే అవుతుంది.
విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఇది టర్నింగ్ పాయింట్ అవుతుందా లేదా అన్నది జూలై 31 తర్వాత తెలుస్తుంది. అభిమానులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.
ALSO READ: Saiyaara Collections కి బాక్స్ ఆఫీస్ కూడా దద్దరిల్లిందా?













