HomeTelugu Newsహీరో యాదా కృష్ణ కన్నుమూత

హీరో యాదా కృష్ణ కన్నుమూత

Untitled 1
టాలీవుడ్‌లో ఒకప్పటి హీరో యాదా కృష్ణ(61) కన్నుమూశారు. ఈరోజు (బుధవారం) ఉదయం గుండెపోటు రావడంతో ఆయన హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. నటనతో పాటు ఆయన పలు సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. 2010లో వచ్చిన ‘సంక్రాంతి అల్లుడు’ ఆయనకు చివరి సినిమా. వీవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటి సునాక్షీ, రోషిని, ఏవీఎస్‌, జీవా, కొండ వలస కీలక పాత్రల్లో నటించారు. యాదా కృష్ణ 20కి పైగా తెలుగు సినిమాల్లో ఆయన హీరోగా నటించారు. వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ‘గుప్త శాస్త్రం’, ‘వయసు కోరిక’, ‘పిక్నిక్’ వంటి సినిమాల్లో ఆయన నటించారు.

కేజీఎఫ్‌ డైరెక్టర్‌తో ప్రభాస్ ‘సలార్’

పవన్‌ కళ్యాణ్‌ ఫొటోను షేర్‌ చేసిన రేణుదేశాయ్‌

Recent Articles English

Gallery

Recent Articles Telugu