HomeTelugu Newsచోటా.కె నాయుడు తమ్ముడు అరెస్ట్‌...

చోటా.కె నాయుడు తమ్ముడు అరెస్ట్‌…

7 27
కెమెరామెన్ చోటా.కె నాయుడు తమ్ముడు శ్యామ్.కె నాయుడు ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్నాళ్ల నుంచి తనను వివాహం చేసుకుంటానంటూ ఆయన మోసం చేశాడని జూనియర్‌ ఆర్టిస్ట్‌ సాయిసుధ ఎస్‌.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పెళ్లి చేసుకొమ్మని అడిగితే దాడి చేశారని ఆమె పొలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ మేరకు రెండ్రోజుల క్రితం శ్యామ్ కె. నాయుడిని అదుపులో తీసుకొని ప్రశ్నించారు పోలీసులు. చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు శ్యామ్‌ కె. నాయుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu