HomeTelugu Trendingజిమ్‌లో ఆర్య కసరత్తులు.. నెటిజన్లు షాక్‌..

జిమ్‌లో ఆర్య కసరత్తులు.. నెటిజన్లు షాక్‌..

7 16

హీరో ఆర్య కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ గుర్తింపు తచ్చుకున్న నటుడు. తాజాగా ఆయన జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా తీసిన వీడియోను ఆయన సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. అందులో 400 కిలోల బరువును లెగ్‌ ప్రెస్‌ చేస్తూ కనిపించారు. అంతేకాదు 130 కిలోల బరువును భుజాలపై మోశారు. ‘ఒక్కోసారి అత్యధిక బరువులు మోయాల్సి వస్తుంది. పైన కూర్చుని నవ్వుతూ పోజిస్తున్న మిస్టర్‌ జాన్సన్‌ బరువుతోపాటు మరో 400 కిలోలతో లెగ్‌ప్రెస్‌ చేశా. మిస్టర్‌ జై 130 కిలోల లిఫ్టింగ్‌కు సహాయం చేశారు’ అని పోస్ట్‌ చేశారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతూ కామెంట్లు చేశారు. ఫిట్‌నెస్‌ పరంగా ఆర్య అందరికీ స్ఫూర్తి అని కొందరంటే.. ఆరోగ్యం జాగ్రత్తని మరికొందరు పేర్కొన్నారు. ఆర్య హీరోగా ‘టెడ్డీ’ సినిమా తెరకెక్కుతోంది. ఆయన భార్య సాయేషా సైగల్ హీరోయిన్‌గా నటిస్తుంది. శక్తి సౌందర్‌ రాజన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని స్టూడియో గ్రీన్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu