HomeTelugu Trendingఅజిత్‌కు విలన్‌గా టాలీవుడ్‌ యంగ్‌ హీరో..

అజిత్‌కు విలన్‌గా టాలీవుడ్‌ యంగ్‌ హీరో..

1 17
ఈ మధ్య మన హీరోలుగా నటిస్తూనే.. వేరే హీరోల సినిమాల్లో విలన్‌గా కూడా నటిస్తున్నారు. ఇప్పటికే రానా, కార్తికేయ వంటి హీరోలు విలన్‌గా తమ అదృష్టని పరీక్షించుకున్నారు. ఇక కార్తికేయ విషయానికొస్తే.. ఇప్పటికే కార్తికేయ.. నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో విలన్‌గా మెప్పించాడు. తాజాగా ఈ హీరో.. తమిళంలో అజిత్ సినిమాలో విలన్‌గా యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అజిత్.. హెచ్.వినోద్ దర్శకత్వంలో ‘వాలిమై’ సినిమా చేస్తున్నాడు. ఇందులో విలన్‌గా కార్తికేయ నటించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో విలన్‌ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉందట. అందులో యంగ్ హీరో అయితే సూట్ అవుతుందని భావించి దర్శక, నిర్మాతలు కార్తికేయను సంప్రదించినట్టు సమాచారం.

దానికి కార్తికేయ కూడా అజిత్ సినిమాలో చాన్స్ అనగానే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలుబడటమే తరువాయి.

1a 4

Recent Articles English

Gallery

Recent Articles Telugu