HomeTelugu Trending'చంద్రముఖి-2' మూవీ అప్డేట్‌

‘చంద్రముఖి-2’ మూవీ అప్డేట్‌

chandramukhi 2 update

త‌మిళ డైరెక్టర్‌ పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా చిత్రం ‘చంద్ర‌ముఖి-2’. అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాలో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు సుపరిచితుడైన.. కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, నటుడు రాఘ‌వా లారెన్స్ హీరోగా న‌టిస్తున్నాడు. కొన్ని రోజుల కిత్రం ర‌జినీకాంత్ ఆశీస్సులు తీసుకున్న అనంత‌రం మైసూరు షూటింగ్ షెడ్యూల్‌లో జాయిన్ అయ్యాడు రాఘ‌వా లారెన్స్.

తాజాగా మేక‌ర్స్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను విడుదల చేశారు. చంద్ర‌ముఖి 2 మైసూరు షెడ్యూల్ ఇవాళ పూర్త‌యింది. ఇప్ప‌టికే ఓ బంగ్లా బ్యాక్ డ్రాప్‌లో విడుద‌లైన లుక్ సినిమాపై అంచ‌నాలు పెంచేస్తుంది. ఫ‌స్ట్ పార్టు చంద్ర‌ముఖిలో కామెడీ టైమింగ్‌తో అంద‌రినీ న‌వ్వించిన లెజెండ‌రీ కమెడియ‌న్ వ‌డివేలు సీక్వెల్‌లో కూడా సంద‌డి చేయ‌బోతున్నాడు. ల‌క్ష్మీ మీన‌న్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో క‌నిపించ‌బోతుంది. ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తుండ‌గా.. తోట తరణి ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu