HomeTelugu Trendingకన్యాకుమారిలో హీరో సూర్య-డైరెక్టర్‌ బాల

కన్యాకుమారిలో హీరో సూర్య-డైరెక్టర్‌ బాల

Hero Surya and Director Ba

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య, ప్రముఖ దర్శకుడు బాల కాంబినేషన్ లో ఇప్పటికీ రెండు సినిమాలు వచ్చాయి. సూర్య కెరీర్ లోనే బెస్ట్ అనిపించుకున్న ‘నంద’, ‘పితామగన్’ చిత్రాల తర్వాత మరోసారి బాలాతో ముచ్చటగా మూడో సినిమా చేయబోతున్నాడు. ప్రేక్షకాదరణతో పాటు అవార్డులూ అందుకున్న ఈ రెండు సినిమాలు సూర్య కే కాదు బాలకూ దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. వీరి కాంబోతో ‘పితామగన్’ 2003లో వచ్చింది. ‘నంద’ తో పాటు ‘పితామగన్’ కూడా తెలుగులో ‘శివపుత్రుడు’ పేరుతో డబ్ అయ్యింది.

Image

సోమవారం వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా కన్యాకుమారిలో పూజా కార్యక్రమాలతో మొదలవుతోంది. జ్యోతిక, సూర్య సమర్పణలో వారికి చెందిన 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ చిత్రాలు ఓటీటీలో విడుదలై మంచి గుర్తింపును తెచ్చుకోగా, ఈ నెల 10న థియేటర్లలో విడుదలైన ‘ఈటీ’ చిత్రానికి మాత్రం మిశ్రమ స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మొదలు కాబోతున్న సూర్య, బాల చిత్రంపై అందరూ ఆసక్తిని కనబరుస్తున్నారు.

‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ రివ్యూ

Recent Articles English

Gallery

Recent Articles Telugu