HomeTelugu Trendingసెన్సేషనల్ స్టార్‌తో 'RX 100' దర్శకుడు

సెన్సేషనల్ స్టార్‌తో ‘RX 100’ దర్శకుడు

11 5రామ్‌ గోపాల్‌వర్మ శిష్యుడు అజయ్ భూపతి.. టాలీవుడ్‌కి అస్సలు పరిచయంలేని హీరో, హీరోయిన్‌ తో సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. RX 100 బ్లాక్ బస్టర్ కావడంతో అజయ్ భూపతికి అవకాశాలు వెల్లువలా వచ్చి పడతాయని ఏదో స్టార్ హీరోతో సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు. అనుకున్నట్టే ఆయన ‘మహాసముద్రం’ స్క్రిప్ట్‌తో రెడీ అయిపోయారు. ఆ కథను పట్టుకుని హీరోల వద్దకు వెళ్లారు. కానీ, ఎక్కడికెళ్లినా కథ విని నో అని చెబుతున్నారన్న ప్రచారం సాగింది. ఈ మధ్య ఈ సినిమాను రవితేజతో రూపొందించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు నుంచి రవితేజ తప్పుకున్నాడని సమాచారం.

అయితే ఇదంతా ప్రచారమే కాగా తాజాగా ఓ సెన్సేషనల్ స్టార్ హీరోతో అజయ్ భూపతి సినిమా ఖరారైపోయినట్టు ప్రకటన వెలువడింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆయన తన మూడో సినిమా చేయనున్నాడని భవ్య క్రియేషన్స్ వారే ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అజయ్ భూపతి దర్శకత్వంలో తాము నిర్మించనున్న సినిమాలో ఒక సెన్సేషనల్ స్టార్ హీరో నటించనున్నట్టు ప్రకటించారు. మిగతా వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. అయితే ఇక్కడ అంతా బాగానే ఉన్నా ఆయన తీసింది ఒక సినిమానే అయినా మూడో సినిమా అని ప్రకటించడమే ఇప్పుడు మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. అది పొరపాటున షేర్ చేశారా లేక దాని వెనుక కూడా ఏదైనా లెక్కుందా ? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu