HomeTelugu Big Storiesమాట నిలబెట్టుకున్న విజయ్‌ దేవరకొండ

మాట నిలబెట్టుకున్న విజయ్‌ దేవరకొండ

1

‘ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 12’లో ఫైనల్స్ కి చేరిన తెలుగమ్మాయి షణ్ముక ప్రియకు హీరో విజయ్ దేరకొండ తన సినిమాలో పాడే అవకాశం ఇస్తానని హామీ ఇచ్చాడు. ఆ మాటని విజయ్‌ దేవరకొండ నిలబెట్టుకున్నారు. విజయ్‌ దేవరకొండ హీరోగా పాన్‌ ఇండియా స్థాయిలో పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘లైగర్‌’లో ఆమెతో ఓ పాట పాడించారు. తాజాగా ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు. షణ్ముఖ ప్రియని కలిసి, ఆమెతో ముచ్చటించిన దృశ్యాల్ని అభిమానులతో పంచుకున్నారు. ‘విజయ్‌ దేవరకొండకి నేను అభిమానిని. అలాంటి ఆయన నా గురించి మాట్లాడతారని, నాకు మద్దతిస్తారని ఎప్పుడూ ఊహించలేదు.

ఇది నేను నమ్మలేకపోతున్నా’ అని విజయ్‌ని కలవకముందు షణ్ముఖప్రియ మనసులోని మాట ఇది. ఈ విషయాన్నే ఇప్పుడు విజయ్‌ షేర్‌ చేసిన వీడియోలో చూపించారు. త్వరలోనే షణ్ముఖ ఆలపించిన గీతాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. షణ్ముఖగానం విజయ్‌ని విశేషంగా ఆకట్టుకోవడంతో ‘‘ఇండియన్‌ ఐడల్‌’ లో నువ్వు ఓడినా, గెలిచినా హైదరాబాద్‌ వచ్చాక మనం కలుస్తాం. నువ్వు నా సినిమాలో పాడతావ్‌. ఇది డీల్‌’ అంటూ గతంలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ఇప్పుడు ఆ వాగ్ధానం నెరవేర్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu