HomeTelugu Big Stories'ఆచార్య' అప్డేట్‌

‘ఆచార్య’ అప్డేట్‌

Acharya shooting update

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రామ్‌ చరణ్‌కి జోడీగా పూజా హెగ్డే కనిపించనుంది. ఈ సినిమా వేసవిలోనే విడుదల కావాల్సింది. అయితే కరోనా కారణంగా వాయిదా పడింది. లాక్‌డౌన్‌ అనంతరం ఈ మూవీ షూటింగ్‌ పునఃప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన అప్డేట్‌ ని ఫ్యాన్స్‌తో పంచుకుంది మూవీ యూనిట్‌. నేటితో టాకీ పార్ట్‌కి సంబంధించిన షూటింగ్‌ పూర్తయినట్టు సోషల్‌ మీడియా ద్వారా తెలియజేసింది. రెండు పాటల చిత్రీకరణ మిగిలి ఉన్నట్టు పేర్కొంది. అంతేకాదు ఈ సందర్భంగా చిరంజీవి – చరణ్ లకు సంబంధించిన ఓ పోస్టర్ ని కూడా వదిలారు. అన్ని కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది కాబట్టి మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఆగస్ట్ 22న ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అలానే త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారు.దేవాదాయ శాఖ నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu