HomeTelugu Trendingయాంకర్‌గా మారనున్న ఇలియానా.!

యాంకర్‌గా మారనున్న ఇలియానా.!

3
టాలీవుడ్ హీరో నటించిన ‘దేవదాస్’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా.. అనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. దక్షిణాదిలో కోటి రూపాలయ పారితోషికం తీసుకున్న ఫస్ట్‌ హీరోయిన్ గా గుర్తింపు పొందింది ఈ బ్యూటీ. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలందరితో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో అవకాశాలు రావడంతో… అక్కడ కూడా మంచి నటిగా గుర్తింపు పొందింది. అయితే, ఇటీవలి కాలంలో సినీ అవకాశాలు తగ్గిపోయాయి. కొత్త కెరీర్ ను స్టార్ట్‌ చేసేందుకు రెడీ అవుతుంది. యాంకర్ గా మారేందుకు ప్రయత్నిస్తుంది ఇలియానా. యాంకర్ అంటే బుల్లితెర షోలలో యాంకర్ కాదు. స్పోర్ట్ ఛానల్ లో యాంకర్ గా మారేందుకు సన్నాహలు చేస్తోంది. ఇప్పటికే ఓ స్పోర్ట్స్ ఛానల్ యాజమాన్యంతో చర్చలు కూడా జరిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu