‘సాహో’ ఫస్ట్‌ సింగిల్‌

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ జంటగా నటిస్తున్న ‘సాహో’ లోని తొలి పాట టీజర్‌ను ఇటీవల విడుదల చేసిన చిత్రబృందం ఇప్పుడు ఫుల్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. ‘సైకో సయ్యాన్‌.. ‘ అంటూ సాగే ఈ పాటలో ప్రభాస్‌ చాలా హ్యాండ్సమ్‌గా కనిపించారు. ఓ పార్టీలో శ్రద్ధ మద్యం సేవిస్తూ ప్రభాస్‌తో కలిసి చిందులేస్తుంటారు. ఆమె పాటలో తన డ్యాన్సులతో, అందంతో ఆకట్టుకున్నారు. సుజీత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జిబ్రాన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆగస్టు 15న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.