HomeTelugu Trendingభార్య,పిల్లల కోసం పాత వృత్తిని చేస్తున్న సంపూర్ణేష్‌బాబు

భార్య,పిల్లల కోసం పాత వృత్తిని చేస్తున్న సంపూర్ణేష్‌బాబు

1 23
టాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్‌ వంగ ఇంటి పనుల్లో సహాయం చేసి, నిజమైన మగాళ్లు అనిపించుకుందాం’ అని ‘బీ ది రియల్‌ మేన్‌ ఛాలెంజ్‌’ ను స్టార్ట్‌ చేశాడు. ఆ తర్వాత రాజమౌళి, సుకుమార్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, కొరటాల శివ, కీరవాణి ఈ ఛాలెంజ్‌ను స్వీకరించారు. ఎన్టీఆర్‌ విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించిన చిరంజీవి, వెంకటేష్‌ కూడా ‘బీ ది రియల్‌ మేన్‌’ ఛాలెంజ్‌ వీడియోలు పోస్ట్‌ చేశారు. తన భార్యాపిల్లల కోసం టాలీవుడ్‌ నటుడు సంపూర్ణేశ్‌బాబు కంసాలిగా మారారు. ‘బీ ది రియల్‌ మేన్’ అని పేర్కొంటూ ప్రతి ఒక్కరి మనసును హత్తుకునే ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఛాలెంజ్‌కి తనని ఎవ్వరూ నామినేట్ చేయకపోయినా సంపూర్ణేష్‌బాబు భిన్నంగా స్పందించాడు. ‘రాజు పేద తేడా లేదు…నీ ఆస్తి, డబ్బు నీ వెనక రావు. నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు అని నా నిజమైన స్థానం గుర్తు చేసుకుంటూ.. మా ఆవిడ కోసం, నా పాత “కంశాలి”వృత్తి ని గుర్తు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన గజ్జెలతో, తనకి కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేసి ఇచ్చాను. ‘అంటూ ఓ వీడియోను షేర్ చేసారు సంపూర్ణేష్ బాబు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu