HomeTelugu Big Storiesపెళ్లి చేసుకున్న కళ్యాణ్‌ రామ్‌ హీరోయిన్‌

పెళ్లి చేసుకున్న కళ్యాణ్‌ రామ్‌ హీరోయిన్‌

Heroin sana khan marriage w
టాలీవుడ్‌లో కళ్యాణ్ రామ్‌ ‘కత్తి’ సినిమా హీరోయిన్‌గా నటించిన బ్యూటీ సనా ఖాన్. తన అందం, నటనతో సినీ ప్రేక్షకులను మెప్పించిన సనా, ఆపై ‘గగనం’, ‘మిస్టర్ నూకయ్య’ల్లోనూ కనిపించింది. హిందీ, తమిళ సినిమాల్లోనూ నటించింది. తాజాగా, గుజరాత్ కు చెందిన ముఫ్తీ అనాస్ అనే యువకుడిని పెళ్లి చేసుకుని సర్‌ప్రైజ్‌ ఇచ్చింది సనా ఖాన్. పెళ్లి దుస్తుల్లో ఉన్న సనా ఖాన్, ముఫ్తీ చిత్రాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కరోనా నేపధ్యంలో కేవలం దగ్గరి కుటుంబీకుల మధ్య సనా వివాహం జరిగినట్టు సమాచారం. ఇక పెళ్లి తరువాత తాను పూర్తిగా సినిమాలను మానేస్తున్నానని, సినిమాల కోసం తనను సంప్రదించవద్దని ఆమె ప్రకటించింది.

గత కొన్నేళ్లుగా సినిమాల్లో రాణిస్తూ, ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నానని, ఈ విషయంలో తాను అదృష్టవంతురాలినని వ్యాఖ్యానించిన ఆమె, తనకు పేరు, సంపద, గౌరవాలను సినీ పరిశ్రమ అందించిందని పేర్కొంది. ఇకపై సినిమా లైఫ్ స్టయిల్ కు పూర్తి దూరం కావాలని భావిస్తున్నామని, మానవత్వం కోసం పనిచేస్తూ, సేవ చేయడానికి ప్రయత్నిస్తానని తెలిపింది.

https://www.instagram.com/p/CH2u4-dJ0d3/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu